Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఖైరతాబాద్ గణపతి శోభాయాత్రకు అమిత్ షా రాక‌

ఖైరతాబాద్ గణపతి శోభాయాత్రకు అమిత్ షా రాక‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఖైరతాబాద్ బడా గణపతి శోభాయాత్రకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారని.. ఆయన రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామ‌ని డీసీపీ శిల్పవల్లి చెప్పారు. ముఖ్యంగా చార్మినార్, ఎంజే మార్కెట్ ఏరియాలో ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గణేషుడి మండపాల దగ్గర ఆకతాయిలను గుర్తించడానికి ఇప్పటికే షీ టీమ్స్, ఎస్వోటీ పోలీసులు మఫ్టీలో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.

వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6, 7 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. మిలాద్ ఉన్ నబి ర్యాలీని ముస్లింలు ఈ నెల 14కు వాయిదా వేసుకున్నారన్నారు. ఇతర జిల్లాల పోలీసులు, ప్రత్యేక బలగాలను బందోబస్తుకు వాడుతున్నామని చెప్పారు. పెద్ద విగ్రహాలు నిమజ్జనం అయ్యేవరకు కానిస్టేబుల్ స్థాయి అధికారి ఉంటాడని తెలిపారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహాలను విసిరేయకుండా క్రేన్ల సహాయంతోనే నిమజ్జనం చేయాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad