నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. ఈ అంశంలో తవ్విన కొద్ది నివ్వెరపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కీలక భేటీ జరిగింది. ఎన్ఐఏ, ఐబీ చీఫ్‍లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఢిల్లీ పేలుడు దర్యాప్తుపై ఈ సందర్భంగా అమిత్ షా ఆరా తీశారు. ఇవాళ సాయంత్రం సీసీఎస్ కీలక సమావేశం జరగబోతోంది. మరో వైపు ఈ ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేస్తూ దర్యాప్తు నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంత్రిత్వ శాఖ ఏఎన్ఐ ఎజెన్సీని ఆదేశించింది. అలాగే పేలుడు స్థలం నమూనాలను విశ్లేషించి, సరిపోల్చి నివేదికను వెంటనే అందించాలని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీను ఆదేశించారు.
ఎన్ఐఏ, ఐబీ చీఫ్ లతో అమిత్ షా కీలక భేటీ..పేలుడు దర్యాప్తుపై ఆరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



