- Advertisement -
నవతెలంగాణ-జన్నారం దండేపల్లి
చిన్నారుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల HM బుచ్చయ్య పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో ‘అమ్మానాన్న ఆశీర్వాదం’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పిల్లల్లో క్రమశిక్షణ, సంస్కారం పెంపొందించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థులు సమయపాలన పాటించేలా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
- Advertisement -



