నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూకశ్మీర్ ఎప్పటికైనా భారతదేశంలో భాగమని నేషనల్ కాన్ఫెరెన్స్ చీప్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. శనివారం ఉగ్రదాడి జరిగిన పహల్గాంను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన టూరిష్టులను కలిసి పలకరించారు. ఉగ్రదాడితో తమ దేశ టూరిష్టులకు భయమే లేదని, మరోమారు పహల్గాంకు వచ్చిన యాత్రికులనే నిదర్శమన్నారు. ఉగ్రవాదం నశించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఉగ్రచర్యలను అరికట్టే విధంగా తామంత ముందుకు సాగుతామని, ఎదో ఒకరోజు తీవ్రవాదాన్ని అంతమ చేసే సూపర్ పవర్ ఎదుగుతామని ఆయన దీమా వ్యక్తం చేశారు. “బిలావల్ భుట్టో ప్రకటనలను మనం అనుసరిస్తే, మనం ముందుకు సాగలేము. సింధు జల ఒప్పందాన్ని మళ్ళీ సమీక్షించాలని నేను చాలా కాలంగా చెబుతున్నాను ” అని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు.