Magazines

ట్రంప్‌-జెలెన్‌స్కీ మధ్య

1 గంట క్రితం

Trump And Zelenskyy
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 4 నిమిషాల చదవడం

రష్యాతో అమెరికా ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఉక్రెయిన్‌

జెలెన్‌స్కీపై ట్రంప్‌ కస్సుబుస్సు...కీవ్‌కు కొత్త నేత అవసరం ఉన్నదని వ్యాఖ్య
ఈ డీల్‌తో పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటున్న పరిశీలకులు


వ్యూహాలు, ఎత్తుగడలు రాజకీయ నాయకులకు కొత్తేమీ కావు. అమెరికా-రష్యా మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం విషయంలో ఇరు దేశాల అధ్యక్షులకు వేర్వేరు వ్యూహాలు ఉన్నాయి. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు మధ్యంత ఎన్ని కలలో రిపబ్లికన్‌ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయన్న విషయం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు తెలియనిదేమీ కాదు. అందుకే డీజిల్‌ సరఫరాలపై రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఓటర్లను ప్రసన్న చేసుకోవాలని అనుకున్నారు. ట్రంప్‌తో స్నేహ సంబంధాలు కొనసాగిస్తే తమ రిఫైనరీలపై దాడులకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెగబడకపోవచ్చునని ఆయన భావిస్తున్నారు.


వాషింగ్టన్‌ : మాస్కోతో వాషింగ్టన్‌ కుదుర్చు కున్న ఇంధన ఒప్పందం అమెరికా, ఉక్రెయిన్‌ అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య చిచ్చు రేపింది. ఈ ఒప్పందాన్ని వ్యతి రేకిస్తున్న జెలెన్‌స్కీ పై అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌కు కొత్త నాయకుడి అవసరం ఉన్నదని చెప్పారు. 'నేను ఏమి సూచి స్తానో మీకు తెలుసా? ఒప్పందం కుదు ర్చుకునే సత్తా ఉన్న కొత్త నాయకుడిని ఎన్ను కోవాల్సింది గా ఉక్రెయిన్‌ ప్రజలకు సలహా ఇస్తా ను. ఆయన ఎన్నో ఒప్పం దాలు కుదుర్చు కోగలరు కానీ ఆ పని ఎన్నడూ చేయలేదు' అని అధ్యక్ష భవనంలో ట్రంప్‌ విలేకరుల తో అన్నారు. అమెరికా-రష్యా మధ్య కఁదిరిన ఇంధన ఒప్పం దాన్ని జెలెన్‌స్కీ వ్యతిరేకిస్తూ 'ముగించాల్సిన యుద్ధంలో ఇది ఓ పెట్టుబడి. యుద్ధాన్ని ముగిం చాలే కానీ పొడిగించకూడదు' అని వ్యాఖ్యానించారు.


మరింత పెరిగిన దూరం
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ దాడులు జరపడంపై ట్రంప్‌ గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ అమెరికా అధికారి తెలిపారు. రష్యా ఇంధన రిఫైనరీలపై దాడులు ఆపాల్సిందిగా ఉక్రెయిన్‌ను అమెరికా పదే పదే కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆయన తెలిపారు. వాస్తవానికి ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య చాలా కాలం నుంచి సత్సంబంధాలు లేవు. దేశంలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంధన ధరల ను తగ్గించేందుకు ట్రంప్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో భాగంగానే ప్రపంచ మార్కెట్లకు మాస్కో ఇంధన సరఫరాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఒప్పందం కుదుర్చు కున్నారు. ఈ పరిణామం నేపథ్యంలో ట్రంప్‌-జెలెన్‌స్కీ మధ్య దూరం మరింత పెరిగింది. రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ జరుపుతున్న నిరంతర దాడులు కూడా ఈ ఒప్పందానికి కారణమ య్యాయని ఓ అధికారి చెప్పారు.


బలమైన భాగస్వాములు 
కుదుర్చుకున్న బలహీన ఒప్పందం
రష్యాతో మీరు కుదుర్చుకున్న ఒప్పందం ఉక్రెయిన్‌ యుద్ధాన్ని మరికొంత కాలం పొడిగిం చవచ్చునని వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా 'యుద్ధాన్ని ఆపాలని అనుకుంటే జెలెన్‌స్కీ ఆ పని ఎప్పుడో చేసి ఉండేవారు. కానీ ఆయన అలా చేయ కూడదని నిర్ణయించుకున్నారు' అని విమర్శించారు. అమెరికా రిఫైనరీలపై దాడులు చేస్తున్న జెలెన్‌స్కీపై మండిపడుతూ ఆయన ప్రపంచానికి సమస్యలు సృష్టించాలని అనుకుంటున్నారని చెప్పారు. ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించాలని ట్రంప్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అయితే ఉక్రెయిన్‌ చట్టాల ప్రకారం యుద్ధ సమయంలో ఎన్నికలు జరపకూడదు. మయామీలో ఉక్రెయిన్‌-అమెరికా మధ్య చర్చలు ప్రారంభమవుతున్న తరుణంలో ట్రంప్‌ చేసిన ప్రకటనపై జెలెన్‌స్కీ ధ్వజమెత్తుతూ 'ఆ ఒప్పందం బలమైన భాగస్వాముల మధ్య కుదిరిన బలహీన ఒప్పందం' అని ఎద్దేవా చేశారు.


ఒకటిన్నర రోజుల అవసరాలనే తీరుస్తుంది

ప్రపంచ ఇంధన మార్కెట్లకు మూడు లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను వెంటనే సరఫరా చేసేందుకు పుతిన్‌ అంగీకరించారని, వచ్చే నెలలో మరో ఐదు లక్షల టన్నులు ఇస్తానని హామీ ఇచ్చారని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో రాశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే ఎనిమిది లక్షల టన్నులు అని చెప్పుకోవడం ఘనంగానే ఉన్నప్పటికీ అది కేవలం అరవై లక్షల బ్యారల్స్‌కు మాత్రమే సమానం. యూఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ చెబుతున్న దాన్ని బట్టి ఈ అరవై లక్షల బ్యారల్స్‌ డీజిల్‌ కేవలం ఒకటిన్నర రోజుల అమెరికా ఇంధన అవసరాలనే తీరుస్తుంది. పైగా ఉక్రెయిన్‌ దాడుల కారణంగా రష్యా చమురు నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్నందున ట్రంప్‌ చెబుతున్న పరిమాణంలో డీజిల్‌ను అమ్మడానికి పుతిన్‌ వద్ద చాలినన్ని నిల్వలు ఉన్నాయో లేదో కూడా తెలియదని అమెరికా మాజీ అధికారులు తెలిపారు. ఈ వారంలో రష్యాలోని ఐదు రిఫైనరీలపై దాడులు చేశానని ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఇంధన ఒప్పందం గురించి ట్రంప్‌ ప్రకటన చేసిన తర్వాత ఉక్రెయిన్‌ తన దాడుల వివరాలు బయటపెట్టింది.


విమర్శలు..అనుమానాలు

అమెరికా-రష్యా మధ్య తాజాగా కుదిరిన ఒప్పందం డీజిల్‌ ధరలను చెప్పుకోదగిన స్థాయిలో తగ్గించబోదని విశ్లేషకులు తెలిపారు. ఈ ఒప్పందం పెద్ద మార్పేమీ తీసుకురాబోదని వారు పెదవి విరిచారు. ఇప్పటి నుంచి ఈ సంవత్సరాంతం వరకూ సరఫరాలు ఓ ఐదారు శాతం మాత్రమే పెరుగు తాయని అంచనా వేశారు. అసలు ఇచ్చిన హామీ మేరకు రష్యా ఇంధనాన్ని సరఫరా చేయగలుగుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమ వుతున్నాయి. పుతిన్‌ తన హామీని నిలబెట్టుకుంటారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న కాదని అమెరికా విదేశాంగ శాఖ మాజీ అధికారి ఒకరు చెప్పారు. 'మధ్యంతర ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి ఈ ఒప్పందాన్ని ట్రంప్‌ వాడుకుంటారు. ఆయనకు కావాల్సింది కూడా అదే. రష్యా డీజిల్‌ను సరఫరా చేసినా చేయకపోయినా ఆయనకు పట్టదు' అని వ్యాఖ్యానించారు. రష్యాతో ట్రంప్‌ కుదుర్చుకఁన్న ఒప్పందాన్ని మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తప్పుపట్టారు. 'ఇది దివంగత సెనెటర్‌ లిండ్సే గ్రహం వారసత్వాన్ని, నాయ కత్వాన్ని అవమా నించడమే అవుతుంది. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం అందించాల్సిన అవసరం ఉంది. పుతిన్‌ యుద్ధ కాంక్షకు అమెరికా జీవం పోయకూడదు. 
ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడు అయినప్పుడు రష్యా దురాక్ర మణను మనం ఖండించాం. ఇప్పుడు కూడా అదే వైఖరిని తీసుకోవాలి' అని సూచించారు. 'పుతిన్‌ తన హామీని నిలబెట్టుకొని డీజిల్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తే అది కేవలం ఓ తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవు తుంది తప్ప మరేమీ కాదు' అని ఇంధన విశ్లేషకుడు గ్రెగొరీ బ్రూ అన్నారు. ట్రంప్‌నకు అనుకూలంగా ఉంటే తమ రిఫైనరీలపై దాడులను ఉక్రెయిన్‌ ఆపేస్తుందని పుతిన్‌ ఆశిస్తున్నారని, అయితే జెలెన్‌స్కీ ఆ పని చేయకపోవచ్చునని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్