Magazines

ఇరాన్‌తో మక్కా ఒప్పందం సభ్యుల భేటీ

1 గంట క్రితం

Meeting of 'Mecca Agreement' members with Iran
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాద విధానాలు, లెబనాన్‌ ఆక్రమణ, ఇరాన్‌పై అమెరికా యుద్ధం వంటి అంశాలపై చర్చించేందుకు సౌదీ అరేబియా, పాకిస్తాన్‌, తుర్కియే నేతలు, సీనియర్‌ అధికారులు సోమవారం టెహ్రాన్‌ చేరుకున్నారు. ఇరాన్‌కు, మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంలోని సభ్యులకు మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరగడం ఇదే మొదటిసారి. సౌదీ రక్షణ మంత్రి ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సాద్‌, పాకిస్తాన్‌ మిలిటరీ చీఫ్‌ ఫీల్డ్‌ మార్షల్‌ అశిమ్‌ మునీర్‌, తుర్కియే ఇంటెలిజెన్స్‌ అధిపతి ఇబ్రహీం కలిన్‌ టెహ్రాన్‌లో ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి మొహసేన్‌ రెజాయితో సమావేశమయ్యారని విదేశాంగ ప్రతినిధి ఇస్మా యిల్‌ బాఘై చెప్పారు. ఇదిలావుండగా సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి దళాలు రాజధాని సనా సహా యెమెన్‌లో హౌతీల నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై దాడులు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్