Magazines

బల్గేరియాలో నవంబర్‌ 1న 
రన్‌-ఆఫ్‌ పోలింగ్‌

1 గంట క్రితం

Run-off polling in Bulgaria on November 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

సోఫియా : బల్గేరియా అధ్యక్ష ఎన్నికలో అతి తక్కువ శాతం పోలింగ్‌ నమోదు కావడం, ఏ ఒక్క అభ్యర్థికీ అవసరమైన ఓట్లు లభించకపోవడంతో రన్‌-ఆఫ్‌ (రెండో రౌండ్‌) ఓటింగ్‌ అనివార్యమైంది. ఆదివారం జరిగిన ఎన్నికలో ప్రస్తుత అధ్యక్షురాలు ఇలియానా లటోవాకు 35-36.5 శాతం ఓట్లు, ఆమె ప్రత్యర్థి, మాజీ ఆపద్ధర్మ ప్రధాని ఆండ్రీ గ్యురోవ్‌కు 31-33.5 శాతం ఓట్లు లభించాయని ప్రాథమిక ఫలితాలను బట్టి తెలుస్తోంది. దీంతో వచ్చే నెల 1వ తేదీన రెండో రౌండ్‌ పోలింగ్‌ నిర్వహిస్తారు. నాటో, యూరోపియన్‌ యూనియన్‌ సభ్యదేశమైన బల్గేరియాలో అధ్యక్ష పదవికి 27 మంది పోటీ పడ్డారు. తొలి రౌండ్‌లో విజయం సాధించాలంటే పోలింగ్‌ యాభై శాతం దాటాల్సి ఉంటుంది. అలాగే ఏ ఒక్క అభ్యర్థికైనా పోలైన ఓట్లలో యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అయితే ఆదివారం జరిగిన పోలింగ్‌లో కేవలం 22.2 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదైంది. పెరిగిన ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, నల్ల సముద్రంలో దాడులు, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వంటి అంశాలు ప్రచారంలో ముందుకు వచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్