చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపు
రక్షణ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి
బీజింగ్ : చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటూ
కొత్త సవాళ్లను అధిగమించి, అభివృద్ధిలో మరిన్ని విజయాలు సాధించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. 1934–36 మధ్య చైనా రెడ్ ఆర్మీ చేపట్టిన చారిత్రక లాంగ్ మార్చ్ విజయానికి 90 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్వయం సమృద్ధి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసు కోవడం, కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగడం వంటి సూత్రాలు నేటి చైనా అభివృద్ధికీ మార్గదర్శకాలని వివరించారు.
సైనిక ఆధునికీకరణ మరో లక్ష్యం
చైనాను అన్ని రంగాల్లో ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దడం, జాతి పునరుజ్జీవనాన్ని సాధించడం తమ ముందున్న లక్ష్యాలని జిన్‌పింగ్ చెప్పారు. సైన్యాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా బలోపేతం చేయాలనీ, సైన్యంపై కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు. 2026–30 మధ్య అమలయ్యే 15వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా రక్షణ రంగ ఆధునికీకరణను వేగవంతం చేయనున్నారు. సాంకేతిక స్వయం సమృద్ధి, ఆధునిక ఆయుధాల అభివృద్ధి, సైనిక సామర్థ్యాల పెంపు వంటి అంశాలు ఈ కొత్త లాంగ్ మార్చ్‌లో కీలకమని చైనా భావిస్తోంది. చారిత్రక పోరాట స్ఫూర్తితో ప్రస్తుత సవాళ్లను అధిగమించి మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యమని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు.
కొత్త సవాళ్లకు కొత్త మార్గాలు
లాంగ్ మార్చ్ నుంచి నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవడమేనని చైనా నిపుణులు వివరించారు. పాత పద్ధతులు కొత్త సమస్యలకు పరిష్కారం చూపలేనప్పుడు, ఇతరుల అనుభ వాలను గుడ్డిగా అనుసరించకుండా తమ పరిస్థితు లకు తగిన మార్గాలను అన్వేషించాలని సూచించారు.
అంతర్జాతీయంగా పెరుగుతున్న పోటీ, అనిశ్చితి మధ్య చైనా ఆధునికీకరణ లక్ష్యాలను సాధించేందుకు వ్యూహాత్మక పట్టుదలతో పాటు అవసరమైన మార్పులు చేసుకునే సామర్థ్యం కీలకమని వివరించారు. సాంకేతికత, పునరుత్పా దక ఇంధన రంగాల్లో చైనా పురోగతి సాధిస్తోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడు తూ కృత్రిమ మేధ, అణుశక్తి, సింథటిక్ బయాలజీ వంటి రంగాల్లో ముందుకు సాగుతోంది. 2026 ప్రథమార్థం నాటికి చైనాలో పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యం 245.5 కోట్ల కిలోవాట్లకు చేరింది. ఇది మొత్తం విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యంలో 60.7 శాతం.
ప్రజలే బలం.. ఐక్యతే ఆయుధం
చైనా కమ్యూనిస్టు పార్టీ, దేశం, సైనిక చరిత్రలో లాంగ్ మార్చ్‌కు ప్రత్యేక స్థానం ఉందని జిన్‌పింగ్ అన్నారు. నమ్మకం, నిజాయితీ, న్యాయం, ఐక్యతతో కూడిన ఆ స్ఫూర్తి.. కష్టాలను అధిగమించి ముందుకు సాగేందుకు నిరంతరం ప్రేరణనిస్తుందని చెప్పారు. 1934లో కువొమింతాంగ్ పాలకుల సైనిక దాడులను తట్టుకోలేక కమ్యూనిస్టు పార్టీ జియాంగ్జీ, ఫుజియాన్ ప్రాంతాల్లోని ప్రధాన స్థావరాలను విడిచిపెట్టాల్సి వచ్చింది. అదే ఏడాది సుమారు 86 వేల మంది రెడ్ ఆర్మీ సైనికులు సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించారు. దాదాపు 12,500 కిలోమీటర్ల మేర రెండేండ్లపాటు సాగిన ఈ ప్రయా ణంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటం చైనా విప్లవ విజయానికి పునాది వేసింది.






కామెంట్లు (0)