Magazines

‌నేడు మేడిగడ్డ బ్యారేజీ‌ని సందర్శించనున్న బీఆర్‌ఎస్‌ బృందం

1 గంట క్రితం

BRS team to visit Medigadda Barrage today
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం


నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. శనివారం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ వద్ద సమావేశమై అక్కడి నుంచి మేడిగడ్డకు బయలుదేరనుంది.

మార్గమధ్యలో వరంగల్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం అల్పాహారం చేయనుంది. అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ బృందంతో కలిసి మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు. శనివారం ఉదయం 10.30 గంటలకు మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీని సందర్శిస్తారు.

​నేడు హైదరాబాద్‌ ‌ముఖ్యనేతల సమావేశం

మాజీమంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా ముఖ్య నేతల సమావేశం శనివారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో జరగనుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు త్వరలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి హైదరాబాద్ జిల్లా పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌‌చార్జీలతోపాటు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం కోసం నియమించిన ఇన్‌‌చార్జీలు హాజరవుతారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్