నవతెలంగాణ-హైదరాబాద్ : కెనడాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అల్బెర్టా ప్రావిన్స్‌లోని సైనిక శిక్షణా స్థావరంలో మంటలు చెలరేగి నలుగురు కెనడియన్ సైనికులు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. సైనికులు లైవ్ మందుగుండు సామగ్రితో యుద్ధ శిక్షణ పొందుతున్న సమయంలో అక్కడ గడ్డి మైదానంలో మంటలు చెలరేగాయి.
గంటకు 96 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలుల వల్ల ఆ మంటలు కేవలం 30 నుండి 60 సెకన్లలోనే వేగంగా విస్తరించి, సైనికులు తప్పించుకునే లోపే వారిని చుట్టుముట్టాయి. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి మార్క్ కార్నీ స్పందిస్తూ శాంతికాలంలో కెనడా గడ్డపై సైనిక దళాలకు ఎదురైన అత్యంత ఘోరమైన విషాదాలలో ఇది ఒకటి”గా అభివర్ణించారు






కామెంట్‌లు (0)