Magazines

మాతో డీల్‌ చేసుకోవడానికి జెలెన్‌స్కీ సరిపోరు: ట్రంప్‌

1 గంట క్రితం

Zelensky is not good enough to deal with us: Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ- హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై మరోసారి విమర్శలు గుప్పించారు. యుద్ధాన్ని ముగించడానికి జెలెన్‌స్కీ సుముఖంగా లేరని.. అందువల్లే రష్యాపై దాడులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. అమెరికా డీల్‌ చేసుకోవడానికి ఆయన సరైన వ్యక్తి కారని అన్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడిగా ఇక అతడు ఎంతమాత్రం పనికిరారని, కొత్త వ్యక్తిని ఆ పదవికి ఎన్నుకోవడం ఉత్తమమని ఉక్రెయిన్‌ ప్రజలకు సూచించారు. ఆయన వల్లే ఆ దేశం నాశనం అవుతోందని దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్