Magazines

'నువ్వు చాలా అసహ్యంగా కనిపిస్తున్నావు'

1 గంట క్రితం

Trump's body shaming
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 31, 2026 | 2 నిమిషాల చదవడం

జర్నలిస్ట్‌పై ట్రంప్ బాడీ షేమింగ్

ఆరోగ్యంపై ఆరా తీసినందుకు

విలేకరిపై అమెరికా అధ్యక్షుడి గుస్సా

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురువారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అమెరికాలో మిడ్టర్మ్ ఎన్నికల ప్రచార ర్యాలీలను రద్దు చేయడం, ఆయన ఆరోగ్యంపై ప్రశ్నించిన ఒక జర్నలిస్ట్‌పై ట్రంప్ వ్యక్తిగత దూషణకు దిగారు. సదరు విలేకరిని బాడీ షేమింగ్ చేస్తూ "నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, కాస్త ఫిట్నెస్ సాధించు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అసలింతకి వివాదం ఏంటి?

వచ్చే వారంలో అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాన్సాస్, అయోవా రాష్ట్రాల్లో జరగాల్సిన ప్రచార ర్యాలీలను ట్రంప్ రద్దు చేసుకున్నారు. 'కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా తీరికలేకుండా ప్రచారం నిర్వహిస్తున్న కారణంగా అనారోగ్యానికి గురయ్యారా ? అందుకే ఈ ప్రచార ర్యాలీలను రద్దు చేసుకున్నారా?' అని రిపోర్టర్ ట్రంప్ను ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో ట్రంప్ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు.

'అలాంటి ప్రశ్న అడగుతున్న నీకే జబ్బు చేసింది. నువ్వు ఓ రోగివి' అని సదరు జర్నలిస్ట్‌ను ఉద్దేశించి అన్నారు. 'ఈయనను చూడండి, ఇతని శరీరం అస్సలు ఫిట్గా లేదు. చాలా అసహ్యంగా ఉన్నావు. ముందు నువ్వు ఫిట్నెస్ సాధించు. చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తున్నావు' అని జర్నలిస్ట్పై ట్రంప్ మండిపడ్డారు. అయితే తాను కేవలం అధ్యక్షుడి క్షేమసమాచారం తెలుసుకోవడానికి మాత్రమే ఆ ప్రశ్న అడిగానని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ట్రంప్ పట్టించుకోలేదని తెలిసింది. అలాగే తన ఆరోగ్యంపైనా ట్రంప్ మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. కాన్సాస్కు వెళ్లి ప్రత్యక్షంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, అక్కడ రిపబ్లికన్ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు. 'గత రెండు వారాలుగా నన్ను నేను గమనిస్తూనే ఉన్నాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది' అని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్‌కు సర్వే షాక్!

అయితే ఈ మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌నకు ఎదురుగాలి వీస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్‌ మద్దతుదారులు కూడా ఇప్పుడు ఆయనను వ్యతిరేకిస్తు న్నట్టు పేర్కొన్నాయి. 2024అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు ఓటేసిన దక్షిణాసియా అమెరికన్లలో 25 శాతం మంది ఈసారి డెమొక్రాట్లకు వైపు మొగ్గు చూపించనున్నట్లు 'ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్' అనే న్యాయవాద బృందం జరిపిన సర్వేలో వెల్లడైంది. ఇందులో పాల్గొన్న ఓటర్లలో 87శాతం మంది ఇండో-అమెరికన్లుకాగా, మిగితావారు పాకిస్తాన్ , బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందినవారు.

గత అధ్యక్ష ఎన్నికల్లో కమలాహారిస్‌కు ఓటేసిన వారిలో 96శాతం మంది మళ్లీ డెమొక్రాట్లకే జైకొడుతుండ గా, ట్రంప్ మద్దతుదారుల్లో 67శాతం మంది మాత్రమే రిపబ్లికన్లకు మద్దతు ప్రకటించారు. మిగితా 25శాతం మంది డెమొక్రాట్ల వైపు మొగ్గుచూపారు. జాత్యహంకారం, వివక్ష వంటి కారణాలతోనే డెమొక్రాట్లకు ఓటు వేయనున్నట్లు ఇండో- అమెరికన్లు సోషల్ మీడి యాలో బహిరంగంగానే చెబుతున్నారు. కాలి ఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయా ర్క్‌, పెన్సి ల్వేనియా, జార్జియా, మిచిగాన్, నార్త్ కరోలినా వంటి కీలకమైన 'బ్యాటిల్‌గ్రౌండ్' రాష్ట్రాల్లో కేవలం ఒక ట్రొండు శాతం ఓట్లే అభ్యర్థుల జాతకాలను తారుమారు చేస్తాయి. దీంతో మధ్యంతర ఎన్నికల్లో దక్షిణాసియా అమెరికన్ల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయని సర్వే స్పష్టంచేసింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్