Friday, November 28, 2025
E-PAPER
Homeజిల్లాలుKokapet: ఎకరం రూ.151.25 కోట్లు

Kokapet: ఎకరం రూ.151.25 కోట్లు

- Advertisement -




నవతెలంగాణ హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా గండిపేట్‌ మండలం కోకాపేటలో భూములు బంగారం, వజ్రాల కంటే కాస్ట్లీ అయ్యాయి. కో అంటే కోట్లు పలుకుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో కోకాపేటలోని నియోపొలిస్‌ లేఅవుట్‌లో నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం రూ.151.25 కోట్ల రికార్డు ధర పలికింది.

నియోపోలిస్‌లోని ప్లాట్‌ నంబర్‌ 15, 16లోని 9.06 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయగా.. రూ.1,353 కోట్లు ఆదాయం లభించింది. కోకాపేట భూముల వేలంలో లక్ష్మీనారాయణ కంపెనీ ప్లాట్‌ నంబరు 15లో 4.03 ఎకరాలు, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ ప్లాట్‌ నంబరు 16లో 5.03 ఎకరాలు దక్కించుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -