– స్థానికసంస్థల ఎన్నికలు వెంటనే జరపాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -మిర్యాలగూడ
బనకచర్ల నీటి సమస్యపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లిలో జరుగుతున్న రాజకీయ శిక్షణా తరగతుల్లో సోమవారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. గోదావరి జలాలపై ఏపీ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నీటి జలాలపై అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన బనకచర్లపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. స్థానిక సంస్థల పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయన్నారు. ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర నిధులు రావడం లేదన్నారు. వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పేదలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు.
బనకచర్లపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
- Advertisement -
- Advertisement -



