– ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్
నవతెలంగాణ -పరకాల : రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు.బుధవారం ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన కళ్యాణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్న విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు మౌలిక సదుపాయలేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 8 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న డిఇఓ చూసి చూసినట్టుగా వ్యవహరిస్తున్నారంటు విద్యాశాఖ అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వ అనుమతులు లేని నిబంధనలు పాటించని పాఠశాలలను గుర్తించి పర్మిషన్ రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్, పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, రవళి, ప్రవళిక ,సుజాత, మౌనిక, శ్రావణి పాల్గొన్నారు.
విద్యాశాఖ మంత్రిని నియమించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES