Wednesday, May 7, 2025
Homeరాష్ట్రీయంవిద్యార్థులకు సామాజిక చైతన్యం కలిగించే యత్నం

విద్యార్థులకు సామాజిక చైతన్యం కలిగించే యత్నం

- Advertisement -

ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు జ్యోతి
తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో
వేసవి శిక్షణా శిబిరం ప్రారంభం
నవతెలంగాణ – ముషీరాబాద్‌

తెలంగాణ బాలోత్సవం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు అన్ని అంశాలపై సూచనలు అందిస్తారని, సామాజిక చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తారని ఐద్వా జాతీయ ఉపాధ్యక్షులు జ్యోతి తెలిపారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలోత్సవ కార్యవర్గం ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు 20 రోజులపాటు రెసిడెన్షియల్‌ విధానంలో పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారన్నారు. సాంకేతికతపై నైపుణ్యాభివృద్ధి, రాజకీయ మౌలిక అంశాలపై అవగాహన, శాస్త్రీయ దృక్కోణాన్ని అభివృద్ధి చేయడం, లింగ సమానత్వం, సామాజిక సమానత్వం వంటి అంశాల్లో సూచనలు అందించనున్నట్టు వివరించారు. చిన్నతనంలోనే పిల్లలు ఇంటి పనుల్లో భాగస్వాములవ్వాలని సూచించారు. కల్చరల్‌ యాక్టివిటీల్లో భాగంగా నాటకం, నృత్యం, జానపద గేయాలు, కథలు, పాటల బోధన ద్వారా సామాజిక చైతన్యం కలిగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. శారీరక ఆరోగ్యానికి యోగా, ఆహార నియమాలు, దినచర్యలో మార్పులపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ వేసవి సెలవులను విద్యా, సాంఘిక, సాంస్కృతిక వికాసానికి వినియోగించుకుంటున్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నళిని, బాలోత్సవ కమిటీ అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, సెక్రటరీ సోమయ్య, ఉపాధ్యక్షులు సుజావతి, ప్రిన్సిపాల్‌ అంకమ్మ, కవయిత్రి రూప రుక్మిణి, చైల్డ్‌ సైకాలజిస్ట్‌ మమత, ప్రిన్సిపాల్‌ పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -