- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:మిర్యాలగూడ జిల్లా గూడూరు శివారులోని ఇటుక బట్టీల వద్ద ఆదివారం 17 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఐదు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన తబీరామ్‌తో ప్రేమలో పడి, రెండు నెలల క్రితం ఇంట్లో చెప్పకుండా పారిపోయిన బాలికను, వివాహం చేస్తామని చెప్పి తల్లిదండ్రులు తిరిగి గూడూరుకు రప్పించారు. ఇటుక బట్టీల్లో పనికి కుదిరిన తర్వాత, తబీరామ్ మద్యం అలవాటుపై బాలిక ప్రశ్నించడంతో ఘర్షణ చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తబీరామ్ బాలికను హత్య చేసి పారిపోతుండగా, బాలిక తల్లి గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
- Advertisement -



