Friday, January 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..!

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం..!

- Advertisement -

-14 ఏండ్లకు కలుసుకున్న పూర్వ విద్యార్థులు
-ఒకరి కొకరు సంతోషంగా పంచుకున్న మధుర స్మృతులు
నవతెలంగాణ-పెద్దవూర
: పెద్దవూర మండల కేంద్రంలోని శాంతినీకేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తాము చదివిన పాఠశాల లో శుక్రవారం  పదవ తరగతి 2011-2012 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు, ప్రిన్సిపాల్ నడ్డి ఆంజనేయులు,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి,కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు 40 మంది తమ అనుభవాలను పంచుకుంటూ  ఆనాటి జ్ఞాపకాలను, తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు.ఈ స్నేహితులు గతంలో తమ తోటి స్నేహితుల కష్టసుఖాలను పంచుకొని అనారోగ్యానికి గురైనా, మృతి చెందిన స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి తోడుగా నిలుస్తామని అన్నారు.  అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని ముక్తకంఠంగా అందరూ తీర్మానించారు. ఈ సందర్భంగా మిత్రులు అలనాడు చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయి.ఈసందర్బంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మేము శాంతి నీకేతన్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి పూర్తయిన తర్వాత మళ్లీ 14 సంవత్సరాల తరువాత ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మేము ఈ రోజు ఇంత గొప్ప స్థాయికి రావడానికి మాగురువులే కారణమని తల్లి, తండ్రి తరువాత ఎవరైనా గురువులను గౌరవించాలన్నారు. త్రిమూర్తులు అంటే తల్లి, తండ్రి, గురువు అన్నారు. మేము గురుదక్షణ కింద వారికి ఏమిచ్చినా కాని వారు రుణం తీర్చుకోలేమని తెలిపారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో కత్తిపోటు తప్పిన గాని కలంపోటు తప్పదన్నారు. స్థానిక సర్పంచ్ ఐతగోని వెంకటయ్య గౌడ్ మాట్లాడు తూ ఒక చిన్న అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ దేశ అత్యున్నత పదవి అయిన ప్రధాని, రాష్ట్రపతి వరకు ఎవరైనా పాఠశాలకు వెళ్లకుండా గురువుల చేత విద్య బుద్ధులు నేర్చుకున్నారని అన్నారు.ప్రిన్సిపాల్ నడ్డి ఆంజనేయులు మాట్లాడు తూ విద్యార్థులు అన్నీ రంగాలలో రానించి సమాజానికి,తల్లి దండ్రులుకు మంచి పేరు తీసుకరావాలని తెలిపారు.మన పాఠశాల స్థాపించి 25 ఏండ్లు పూర్తి అయిందని సిల్వర్ జూబ్లీ కూడా నిర్వహించాలని సూస్తున్నామని అన్నారు. అలనాటి గురువులు మాట్లాడుతూ 14  సంవత్సరాల తర్వాత మళ్లీ విద్యార్థులందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం అన్నారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు తమ కంటే ఉన్నత స్థాయికి ఎదిగితే దానికి మించిన గురుదక్షిణ లేదన్నారు. విద్యార్థులదరూ గొప్ప స్థాయికి ఎదిగి సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. అనంతరం వారికి విద్యాబుద్ధులు చెప్పిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నడ్డి శ్రీనివాస్,కృష్ణయ్య,ఎస్కే ఇబ్రహీం,ప్రసాద్ పల్లెబోయిన శంకర్,సైదులు,నాగరాజు,వెంకటేశ్వర్లు పూర్వపు విద్యార్థులు సైదులు అంజి,వెంకటేశ్వర్లు, మౌనిక, యాదమ్మ, నస్రీం, నాగలక్ష్మి,భవాని,కోటేష్, ప్రత్యుష,వెంకటేష్,ఆంజనేయులు,నాగరాజు,అనిల్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -