నవతెలంగాణ-హైదరాబాద్: అనంత్ అంబానీ స్థాపించిన వంతారా సంస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఆలయ ఏనుగుల ను తరలిస్తే.. అందులో ఎలాంటి తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏనుగుల తరలింపుపై సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది.
గుజరాత్ జామ్‌నగర్‌లోని వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ క్రమంలో ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పీబీ వరాలేలతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.