Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఆసియా షూటింగ్‌లో అనంత్‌ జీత్‌ సింగ్‌కు గోల్డ్‌ మెడల్‌

ఆసియా షూటింగ్‌లో అనంత్‌ జీత్‌ సింగ్‌కు గోల్డ్‌ మెడల్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కజకస్థాన్‌లో జరుగుతున్న ఆసియా షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల స్కీట్‌ విభాగంలో అనంత్‌ జీత్‌ సింగ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్న అతను మెడల్‌ రౌండ్‌లో కూడా సత్తాచాటాడు. 57 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు.

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ జూనియర్‌ ఈవెంట్‌లో వన్షిక చౌదరి-ఆంటోనీ జొనాథన్‌ గావిన్‌ జోడీ కూడా బంగారు పతకం సాధించింది. గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌లో భారత ద్వయం 16-14 తేడాతో సౌత్‌ కొరియాకు చెందిన కిమ్‌ యేజిన్‌-కిమ్‌ డూయోన్‌ జోడీని చిత్తు చేసింది. మహిళల స్కీట్‌ జూనియర్‌ విభాగంలో కన్వార్‌ అగ్రిమ, మాన్సి, యశస్విలతో కూడిన భారత జట్టు రజత పతకం గెలిచింది.

ఫైనల్‌లో భారత త్రయం 120-123తేడాతో కజకస్థాన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో సురుచి సింగ్‌-సౌరబ్‌ బౌదరి కాంస్యం సాధించింది. బ్రాంజ్‌ మెడల్‌ మ్యాచ్‌లో సౌరబ్‌-సురుచి జంట 17-9తేడాతో చైనీస్‌ తైపీకి చెందిన లియు హెంగ్‌ యు-హ్సీV్‌ా హ్సియాంగ్‌ చెన్‌ జోడీపై విజయం సాధించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad