- Advertisement -
- ఎస్‌జీఎస్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు వాణి రమణ
నవతెలంగాణ-సుల్తాన్ బజార్: ప్రాచీనమైన శాస్త్రీయ నృత్యాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ నృత్య విద్వాంసురాలు, ఎస్‌జీఎస్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు వాణి రమణ అన్నారు. గాయత్రి స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య సమాహారం తెలంగాణ సరస్వత పరిషత్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాణి రమణ పాల్గొన్నారు. మృదంగ విద్వాంసులు పాలకుర్తి రామచంద్ర శర్మ, సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ వ్యవస్థాపక డైరెక్టర్ పద్మ కళ్యాణ్, సంస్కార భారతి సంగీత విధా ప్రముఖ్, బి.ఉదయ్ కుమార్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలను వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. గాయత్రి స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ వ్యవస్థాపకురాలు గాయత్రి స్కూల్ ఆఫ్ కూచిపూడి డాన్స్ ఫౌండర్ డాక్టర్ జ్యోతి శేఖర్ సంస్థను స్థాపించి అనేక విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కళాకారులు యంఎస్.వి హేమలత, కె.రమ్య రెడ్డివి. నిత్య వైష్ణవి, నాగమణి, ఈష, టి.వైష్ణవి ఎన్.హవిష, జి. సాన్విక, పి.ఆరాధ్య, జి.అన్వితా పవని ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కుమారి సి.గాయత్రి శేఖర్ వ్యాఖ్యనం చేశారు.
- Advertisement -



