Friday, May 23, 2025
Homeసినిమాఅంతకుమించి..

అంతకుమించి..

- Advertisement -

విశేష ప్రేక్షకాదరణతో ‘రానానాయుడు’ వెబ్‌ సిరీస్‌ మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌గా ‘రానానాయుడు 2’ని రూపొందించారు. ఈ సీజన్‌ 2 జూన్‌ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా రానా, అర్జున్‌ రాంపాల్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్‌ సినిమాస్‌ ‘రానా నాయుడు’ సీజన్‌2 భారీ పోస్టర్‌ను డుదల చేశారు. రానా మాట్లాడుతూ, ”సీజన్‌ వన్‌ కంటే సీజన్‌2 మరింత వైల్డ్‌గా ఉంటుంది. ఈ సీజన్‌ మరింత పెద్దదిగా, వ్యక్తిగతంగా ఉంటుంది. రానానాయుడు జన్‌2 కోసం మరోసారి టీమ్‌ను కలవటం చాలా ఆనందంగా ఉంది. పాత్రలు మరింత లోతుగా ఉంటాయి. అవన్నీ గందరగోళంగా అనిపిస్తాయి. అన్నీ విషయాల్లో ద్దులను మరింతగా పెంచాం. మీరు ఇష్టపడిన విషయాలను మరో లెవల్‌కు తీసుకెళ్లాం. మొదటి సీజన్‌కు అభిమానుల నుంచి గొప్ప స్పందన వచ్చింది. ఇప్పుడు జన్‌2కి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను అభిమానుల సమక్షంలో ఎక్స్‌క్లూజీవ్‌గా విడుదల చేయటం ఆనందంగా ఉంది. నేను రానా నాయుడుగా నటిస్తే, రవూఫ్‌ పాత్రలో ర్జున్‌ రాంపాల్‌ నటించారు. ఇద్దరం ఢ అంటే ఢ అనేలా నటించాం’ అని తెలిపారు. ‘రవూఫ్‌ పాత్రకు జీవం పోయటం చాలా కష్టమైంది. అయితే కరణ్‌ అన్షుమన్‌ ట్టుదల, అంకితభావంతో అది సాధ్యమైంది. ఆయన పాత్రల్లో అనేక వేరియేషన్స్‌ చూపిస్తూ చక్కగా రాశారు. దీని వల్ల నా పాత్రను నేను చేయటం చాలా లభమైంది. చాలా ఎంజారు చేశాను. ఎలాంటి భయం లేని రానా నాయుడుకి ఈ సీజన్‌లో చాలా కష్టాలుంటాయి. పాత్ర పరంగా నేను చాలా కఠినంగా టించినప్పటికీ టింగ్‌ సమయంలో నేను రానాతో చక్కగా కలిసిపోయాను. ఇక వెంకటేష్‌ కూడా సరదా వ్యక్తే. సూపర్‌ టాలెంటెడ్‌ టీమ్‌తో కలిసి పనిచేశాను. నెట్‌ఫ్లిక్స్‌లో నేను చేసిన దటి సిరీస్‌ కావటంతో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కరణ్‌, సుపర్ణ్‌, అభరు.. ఇలా ముగ్గురు దర్శకులతో ఒకేసారి పని చేయటం నాకు కూడా మొదటిసారే’ ని అర్జున్‌ రాంపాల్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -