- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: జాతీయ సంగీత కళాకారుల సంఘం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 27న కవి అందెశ్రీ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, పాత్రికేయుడు కె. శ్రీనివాస్, ప్రముఖ సాహితీవేత్త ఎం. ప్రభాకర్, తెరసం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, ప్రముఖ కవి సిద్ధార్థ, ప్రముఖ కవి, సినీ టీవీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, అరసం ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్ వక్తలుగా పాల్గొంటారు.
రవీంద్రభారతి సమావేశ మందిరంలో సా. 5 గంటలకు ఉంటుందని సంస్థ అధ్యక్షుడు ఎల్వీ చెన్నారావు తెలిపారు. అందెశ్రీ అభిమానులు తరలి రావలసిందిగా పిలుపునిచ్చారు.
- Advertisement -



