- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కవి, నంది అవార్డు గ్రహీత అందెశ్రీ అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర గేయంగా తాను రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా ప్రకటించింది అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
- Advertisement -



