Sunday, December 21, 2025
E-PAPER
Homeఆటలుఆండ్రీ రస్సెల్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు

ఆండ్రీ రస్సెల్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు తరఫున 12 సీజన్లు బరిలోకి దిగిన రస్సెల్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. అయితే అతడు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు సపోర్టింగ్‌ స్టాప్‌, పవర్‌కోచ్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. 37 సంవత్సరాల రస్సెల్‌ 12 సంవత్సరాల పాటు కేకేఆర్‌ తరఫున ప్రాతినిథ్యం వహించారు. 2014లో ఫ్రాంచైజీలో చేరాడు, జట్టులో కీలక ఆటగాళ్లలో రస్సెల్‌ ఒకడు. రస్సెల్ కేకేఆర్‌ తరఫున 133 మ్యాచులు ఆడాడు. 2014, 2024లో కేకేఆర్‌ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌కు ముందు మెగా వేలానికి ముందు రస్సెల్‌ను రూ.12 కోట్లకు కేకేఆర్‌ నిలుపుకుంది. గత సీజన్‌లో ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడంతో కేకేఆర్‌ అతన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. 2025 సీజన్‌లో 13 ఇన్సింగ్స్‌లో 167 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ రస్సెల్‌ 140 మ్యాచుల్లో 174.18 రేట్‌ 2,651 పరుగులు చేయగా.. 123 వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -