Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి

అంగన్వాడి భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి

- Advertisement -

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

అంగన్వాడి కేంద్రాలకు నూతనంగా మంజూరైన భవన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్సు హాల్ లో సోమవారం సాయంత్రం మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణ, అందుబాటులో ఉన్న సదుపాయాలు, సమకూర్చాల్సిన వసతులు తదితర అంశాలపై చర్చించి, ఐ.సీ.డీ.ఎస్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో 1501 అంగన్వాడి కేంద్రాలకు గాను, 494 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయని, 610 అద్దె భవనాలలో కొనసాగుతున్నాయని తెలిపారు.

మరో 397 కేంద్రాలు అద్దె చెల్లించే అవసరం లేకుండా వివిధ భవనాలలో నిర్వహించబడుతున్నాయని జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ కలెక్టర్ దృష్టికి తేగా, నూతనంగా మంజూరైన అంగన్వాడి భవనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భవన నిర్మాణాల కోసం అవసరమైన స్థల సేకరణ కోసం మండల తహసిల్దర్లను సంప్రదించి త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. 

అన్ని కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ వంటి వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొత్తగా చేపట్టాల్సిన నిర్మాణాలు, సదుపాయాల కల్పన, మరమ్మతు పనులను తక్షణమే ప్రారంభించి, సకాలంలో పూర్తయ్యేలా, నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. పోషణ్ అభియాన్ ను సమర్ధవంతంగా అమలు చేస్తూ చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడాలని హితవు పలికారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావి, డీడబ్ల్యుఓ రసూల్ బీ, పంచాయతీరాజ్ అధికారి శంకర్, ఆర్.డబ్ల్యు.ఎస్ డీ.ఈ రాకేష్, సీడీపీఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -