Thursday, May 1, 2025
Homeజిల్లాలుగాలి బీభత్సంతో అంగన్వాడి తలుపులు ధ్వంసం

గాలి బీభత్సంతో అంగన్వాడి తలుపులు ధ్వంసం

నవతెలంగాణ – మల్హర్ రావు 
బుధవారం రాత్రి వీచిన ఈదురు గాలుల బీభత్సంతో మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో అంగన్ వాడి సెంటర్-3 తలుపులు ధ్వంసం అయ్యాయని అంగన్ వాడి టీచర్ అన్నపూర్ణ గురువారం తెలిపారు. ఉదయం అంగన్ వాడి సెంటర్ తీయడానికి వెళ్లిన నేపథ్యంలో తలుపులు ధ్వంసమైరని అన్నారు. ఈ విషయాన్ని మండల అంగన్ వాడిల సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల నిత్యావసర సరుకులు, ఆట వస్తువులు, తదితర వస్తువులు ఉన్నాయని అన్నారు. తలుపుల ధ్వంసం కావడంతో వీటికి రక్షణ లేకుండా పోతుందని, ప్రభుత్వం వెంటనే కొత్త తలుపులు పెట్టించాలని ఆమె విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img