Thursday, May 1, 2025
Homeఅంతర్జాతీయంభార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న అంగోలా అధ్య‌క్షుడు

భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న అంగోలా అధ్య‌క్షుడు

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: త్వ‌ర‌లో భార‌త‌దేశానికి అంగోలా దేశాధ్య‌క్షుడు రానున్నారు. రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఆహ్వానం మేర‌కు ఆదేశ ప్రెసిడెంట్ జోవో మాన్యువల్ గొన్‌వాల్వ్స్ లారెన్‌కో ఈనెల 1 నుంచి 4 ఇండియాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌తో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతమ‌వుతాయ‌ని విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రెండు దేశాల మ‌ధ్య అత్యున్న‌త స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సాంప్రదాయ వైద్యం, వ్యవసాయం, సాంస్కృతిక సహకార రంగాలలో అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. భారతదేశం 1985లో అంగోలాతో అధికారిక దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. అప్పటి నుండి ఆ దేశంతో దృఢమైన సంబంధాలను ఇండియా కొనసాగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img