Thursday, February 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఈడీ ముందు హాజరైన అనిల్‌ అంబానీ..

ఈడీ ముందు హాజరైన అనిల్‌ అంబానీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరయ్యారు. అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ నకు ప్రమేయం ఉన్న రూ.40 వేల కోట్ల బ్యాంకింగ్, కార్పొరేట్ మోసం కేసులో ఈడీ ఆయనను విచారిస్తోంది.

మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి 26న హాజరుకావాలని ఇటీవల ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఆయన సెంట్రల్‌ దిల్లీలోని ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. కాగా.. బుధవారం అనిల్‌కు చెందిన ముంబయి నివాసం ‘అబోడ్‌’ను ఈడీ అధికారులు అటాచ్‌ చేశారు. దీనివిలువ సుమారు రూ.3,716 కోట్లు ఉంటుందని అంచనా. తాజా వాటితో కలిపి ఈ కేసులో మొత్తం అటాచ్‌మెంట్‌ విలువ రూ.15,700 కోట్లకు చేరింది. అనిల్‌ అంబానీకి చెందిన కంపెనీలు రూ.వేల కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. వీటి మొత్తం విలువ రూ.40వేల కోట్లుగా పేర్కొంది. దీనిపై గతేడాది ఆగస్టులో ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -