నవతెలంగాణ-హైదరాబాద్ : బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బోనీ కపూర్ మాతృమూర్తి నిర్మల్ కపూర్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
ఆమెకు దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు నటుడు అనిల్ కపూర్, నటుడు సంజయ్ కపూర్ కుమారులు కాగా, రీనా కపూర్ ఆమె కుమార్తె. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, శిఖర్ పహారియా, షనాయా కపూర్ తదితరులు ముంబయిలోని లఖండ్ వాలాలో ఉన్న అనిల్ కపూర్ నివాసానికి చేరుకున్నారు.
నిర్మల్ కపూర్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిర్మల్ కపూర్ 90వ పుట్టినరోజు వేడుకలను గత ఏడాది సెప్టెంబర్ నెలలో కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
నిర్మాత బోనీ కపూర్‌కు మాతృవియోగం
- Advertisement -
RELATED ARTICLES