– కలెక్టర్ ఆదేశాలు
నవతెలంగాణ-కామారెడ్డి : జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా వెటర్నరీ పశుసంవర్ధక శాఖ అధికారి, మునిసిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో జంతు జనన నియంత్రణ (Animal Birth Control – ABC) కార్యక్రమాన్ని అత్యవసరంగా ప్రారంభించాలని, గరిష్టంగా రెండు రోజుల్లోనే అమలు చేయాలని ఆయన స్పష్టంగా సూచించారు. ప్రస్తుతం అందుబాటులో లేని అవసరమైన ఔషధాలను తక్షణమే కొనుగోలు చేసి, వాటి లభ్యతను నిరంతరం నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా ప్రారంభించి, ముందుగా ధోమకొండలో అమలు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత జిల్లా అధికారులు ఈ ఆదేశాలను వెంటనే అమలు చేసి, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.



