Friday, July 11, 2025
E-PAPER
Homeఆటలుఅనిసిమోవా సంచలనం

అనిసిమోవా సంచలనం

- Advertisement -

– సెమీస్‌లో టాప్‌సీడ్‌ సబలెంకపై గెలుపు
లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. టాప్‌సీడ్‌, బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంకకు అమెరికాకు చెందిన 13వ సీడ్‌ అమందా అనిసిమోవా ఝలక్‌ ఇచ్చింది. మూడుసెట్ల హోరాహోరీ పోరులో అనిసిమోవా 6-4, 4-6, 6-4తో సబలెంకను చిత్తుచేసింది. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో తొలి సెట్‌లో తొలుత ఒక బ్రేక్‌ పాయింట్‌ సాధించిన అనిసిమోవా.. ఆ ఆధిక్యతను నిలుపుకుంటూ ఆ సెట్‌ను చేజిక్కించుకుంది. కానీ రెండో సెట్‌లో సబలెంక ముందే ఒక బ్రేక్‌ పాయింట్‌ సాధించి ఆధిక్యతలోకి దూసుకెళ్లి.. ఆ సెట్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఇరువురు ఒక్కో సెట్‌ను చేజిక్కించుకొని సమంగా నిలిచారు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో అనిసిమోవా ఒక దశలో 1-4 ఆధిక్యతలో నిలిచింది. కానీ సబలెంక చెలరేగడంతో 3-5తో నిలిచింది. ఆ తర్వాత ఇరువురు ఒక్కో పాయింట్‌ గెలుపొందినా.. అప్పటికే అనిసిమోవా మ్యాచ్‌ విజేతగా నిలిచింది. ఇక టాప్‌సీడ్‌ సబలెంక ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్లో కోకో గాఫ్‌ చేతిలో ఓటమిపాలవ్వగా.. తాజాగా వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌లోనే వినుదిరగడం విశేషం. ఇగా స్వైటెక్‌-బెన్సిక్‌ల మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో శనివారం జరిగే ఫైనల్లో అనిసిమోవా టైటిల్‌కోసం తలపడనుంది.
నేడు పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌
వింబుల్డన్‌ సెంటర్‌ కోర్టులో శుక్రవారం జరిగే పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌ జరగనుంది. తొలి సెమీఫైనల్‌ 5వ సీడ్‌ ఫ్రిట్జ్‌(అమెరికా), 2వ సీడ్‌, కార్లోస్‌ అల్కరాజ్‌(స్పెయిన్‌)ల మధ్య జరగనుంది. అల్కరాజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌-2025 ఛాంపియన్‌గా నిలువగా.. ప్రస్తుతం అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్నాడు. రెండో సెమీస్‌ టాప్‌సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ సిన్నర్‌, 6వ సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ల మధ్య జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -