– ఘనంగా ధ్వజస్తంభ, గోపురం ప్రతిష్ట
నవతెలంగాణ – రాయపర్తి
మండలంలోని ఆరెగూడెంలో ఆంజనేయ స్వామి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం నూతన గోపురం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఉదయం నుంచే ఆలయంలో గణపతి పూజ, ప్రత్యేక హోమం, పూజలు నిర్వహించారు. వేదపండితుల వేద మంత్రోచ్చరణల నడుమ న్యారేపతో చేసిన ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టింపచేశారు. ప్రతి ఇంట ఆడపడుచుల సందడితో గ్రామంలోని ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో ప్రతి ఇంట్లో పిండి వంటల ఘుమఘుమలతో అరెగుడెంలో పండగ వాతావరణం బంధుగణంతో నిండుదనం సంతరించుకుంది. గ్రామంలోని గ్రామస్తులందరూ ఐకమత్యంతో శ్రీ వీరాంజనేయ స్వామి కొలువుదీరిన ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం వేద పండితుల మంత్రోచరణాల మధ్య ఘనంగా అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు కృష్ణమాచార్యులు, బల్లకారి యాకయ్య, బత్తుల సాంబరాజు, సుమన్, ఒడికెల మహేందర్, రాజు, లక్ష్మణ్, దేవరాజ్, వెంకటేశ్వర్లు, నాగేందర్, ప్రవీణ్, అనిల్, భాస్కర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆరెగూడెంలో అంబరాన్నంటిన అంజన్న స్వామి సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES