Monday, September 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా అన్నాభావు సాఠె జయంతి 

ఘనంగా అన్నాభావు సాఠె జయంతి 

- Advertisement -

– వేడుకల్లో ఎమ్మెల్యే పవార్  రామారావు పటేల్ 
నవతెలంగాణ -ముధోల్ 
:   ముధోల్ మండలంలోని సరస్వతి నగర్ లో ఘనంగా సాహిత్య సామ్రాట్‌ డాక్టర్‌ అన్నాభావు సాఠె 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా  ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు.అన్నబావు  సాఠె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.  ఈ  సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.అన్నాభావు సాఠె కష్టపడి విద్యాజ్ఞానాన్ని ఆర్జించి ప్రపంచ ప్రఖ్యాతిచెందిన కవి,రచయితాగా గుర్తింపు పొందారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడి బలహీనవర్గాల్లో చైతన్యం కోసం పాటుపడిన, అన్నభావు సాఠె గారిని అందరూ ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం  గ్రామంలో ఉన్న సమస్యలు ఎమ్మెల్యే విన్నవించగా గ్రామoలోని హనుమాన్ ,దత్తాత్రేయ మందిరాల మంజూరూ కొరకై కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న సిసి రోడ్డు , డ్రైనేజీ, నీటి సమస్యలు , పొలంకు వెళ్లే రోడ్లను, పాఠశాల మరమ్మత్తు కొరకై కృషి చేస్తానని గ్రామ అభివృద్ధి కొరకు దశలవారీగా పూర్తి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బిజేపి మండలనాయకులు నర్సాగౌడ్, ఆత్మ స్వరూప్, రాంచందర్ , శ్యామ్ రావు ,సాయిచంద్, గడ్డేన్న, టి రమేష్  తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -