నవతెలంగాణ – మిర్యాలగూడ
అన్ని దానాల్లో కెల్లా అన్నదానం ఎంతో గొప్పదని సబ్ కలెక్టర్ నారాయణ్మిత్ అన్నారు. కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకోని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో బుధవారం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి, శివ స్వామి, దుర్గా మాత మాలధారణ చేసిన స్వాములకు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ నారాయణమిత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత అలవరుడుతుందని, ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. మాలధారణ చేసిన స్వాములు ప్రతిరోజు మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు జరిగే ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. కాగా ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 2వేల మంది స్వాములు పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్, నాయకులు నూకల వేణుగోపాల్రెడ్డి, దేశిడి శేఖర్రెడ్డి, గుడిపాటి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది: సబ్ కలెక్టర్ నారాయణమిత్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES