Saturday, May 3, 2025
Homeతెలంగాణ రౌండప్అకాలవర్షంతో అన్నదాత కుదేలు

అకాలవర్షంతో అన్నదాత కుదేలు

నవతెలంగాణ – గోవిందరావుపేట : మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షం రైతులను అతలాకుతలం చేసింది. భారీగా కురిసిన వర్షానికి ఆరబోసిన ధాన్యం పలుచోట్ల వరద ప్రవాహంలో కొట్టుకొని పోయింది. ఇంకా కోయాల్సిన వందనాది ఎకరాల వరి పంట నేల వాలింది. నేలవాలిన పంటను వరి కోత యంత్రాల ద్వారా కోయాలంటే డబల్ ధర అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాంటా పెట్టిన ధాన్యం బస్తాలు లోడ్ ఎత్తకపోవడంతో తడిసిపోయినవి.  గత నెల రోజుల్లో నాలుగు వర్షాలు వెంట వెంట రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. గాలి వానతో వచ్చిన వాన కాబట్టి నిలబడి ఉన్న పంట పొలాలన్నీ నేల వాలిపోయాయి. మరో రెండు లేక మూడు రోజులు ఈ వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వార్త కథనాలతో రైతులు కుదేలవుతున్నారు. వర్షానికి తడిసి రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగానే మామూలు ధాన్యాన్ని కొనకుండా రోజుల తరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇటీవల ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన మండల కేంద్రంలో నెలకొంది. ప్రభుత్వం మరో మారు సర్వే చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img