నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల స్థాయి చెకుముకి సైన్స్ టెస్ట్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించి విజేతలను ప్రకటించారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో మండలస్థాయి చెకుముకి సైన్స్ టెస్ట్ జనవిజ్ఞాన వేదిక మండల కన్వీనర్ కొర్ర రఘురామ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ టెస్టులో మండలంలోని 10 హై స్కూల్స్ పాల్గొని టెస్ట్ రాయడం జరిగింది. ఇందులో మొదటి స్థానంలో మెరిట్ హైస్కూల్ గోవిందరావుపేట, రెండవ స్థానంలో జెడ్పిహెచ్ చల్వాయి మూడో స్థానంలో ఏ హెచ్ ఎస్ కర్లపల్లి నిలవడం జరిగింది.
ఈ మూడు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు 27 -11- 2025న ఏటూరు నాగారంలో జరిగే జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ కు హాజరు కావలసి ఉన్నది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మండల విద్యాధికారి గొంది దివాకర్ మాట్లాడుతూ.. సైన్స్ జీవితంలోఎంతోఉపయోగపడుతుందని, మూడ నమ్మకాలను వదిలి సైన్సు ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతూ విజేతగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు ఈక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.



