- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. హైదరాబాద్ నుంచి పుకేట్ బయలుదేరిన ఎయిరిండియా IX 110లో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రయాణికుల భద్రతా రీత్యా వెంటనే సదురు విమానాన్ని వెనక్కి మళ్లించామని అధికారులు తెలిపారు. అదే విధంగా ప్రయాణీకులకు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఉన్నతాధికారులు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా, ఇవాళ ఉదయం వాతావరణంలో పెను మార్పుల కారణంగా రన్ వేపై విజిబుల్టీ సరిగ్గాలేక..ఇండిగో విమానం చాలా సేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు.
- Advertisement -