Tuesday, February 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమ‌రోసారి ఇరాన్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

మ‌రోసారి ఇరాన్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్‌లో మ‌రోసారి విమాన ప్ర‌మాదం సంభ‌వించింది. ఆర్మీకి చెందిన‌ హెలికాప్టర్‌ మంగళవారం కూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్‌, కో పైలెట్‌ సహా నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు దక్షిణంగా 330కి.మీ దూరంలో ఉన్న డోర్చే పట్టణంలో ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇస్పహాన్‌లో ఇరాన్‌ ప్రధాన వైమానిక స్థావరం, అణు కేంద్రం ఉన్నాయి. ఈ అణు కేంద్రంపై గతేడాది జూన్‌లో ఇజ్రాయిల్‌కు మద్దతుగా అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్‌ను శిక్షణ కోసం వినియోగిస్తున్నారని, శిక్షనిస్తుండగా కూరగాయల మార్కెట్‌పై కూలిపోయిందని ఇరాన్‌ అధికారులు తెలిపారు. ప్రమాదంలో సిబ్బందిసహా మార్కెట్‌లోని ఇద్దరు వ్యక్తులు మరణించారని అన్నారు.వారంలో ఇది రెండో ప్రమాదం. ఇరాన్‌ పశ్చిమ నగరమైన హమెడాన్‌ సమీపంలో ఎఫ్‌-4 యుద్ధ విమానం కూలిపోవడంతో పైలెట్‌ మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -