నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుస లైంగిక దాడులు కలకలం రేపుతున్నాయి. ఒడిసా, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు మరువక ముందే..ఉత్తరప్రదేశ్ బలరాంపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. చెవుడు, మూగ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 22 ఏళ్ల యువతి ఆగస్టు 11న తాత ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో దేహాత్ కొత్వాలి ప్రాంతంలో.. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలోని పొలంలోకి ఎత్తుకెళ్లిన దుండగులు.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె వారి నుంచి రక్షించుకునేందుకు పరుగెత్తినా.. బైక్స్‌పై వెంబడించి మరీ.. ఆమెను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.
అయితే అమ్మాయి లేట్ నైట్ అయినా ఇంటికి రాకపోవడంతో వెతికిన కుటుంబీకులు.. ఆమెను పొలాల్లో బట్టలు లేకుండా, స్పృహ కోల్పోయిన స్థితిలో గుర్తించారు. ఆ తర్వాత చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా సైగల ద్వారా ఆమె వివరిస్తుండగా.. ప్రొఫెషనల్స్ సహాయం తీసుకుని కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని తెలిపారు పోలీసు అధికారులు.