నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమబెంగాల్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ చదువుతోన్న విద్యార్థినిపై అత్యాచారం జరగడం ఆందోళన రేకెత్తిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన యువతి(23) దుర్గాపుర్‌లోని శోభాపుర్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. శుక్రవారం రాత్రి భోజనం చేసేందుకు తన ఫ్రెండ్‌తో కలిసి కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో కొందరు దుండగులు వీరిని వెంబడించారు. యువతి ఫ్రెండ్ వారి నుంచి తప్పించుకోని పారిపోగా..దుండగులు బాధితురాలిని పట్టుకుని సమీపంలోని అడవిలో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమాచారం అందగానే ఘటనా స్థలానికి వెళ్లి బాధితురాలిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు వైద్య కళాశాల సిబ్బంది, యువతి స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు వెల్లడించారు.
పశ్చిమబెంగాల్‌లో మరో దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES