Friday, May 9, 2025
Homeతాజా వార్తలుసరిహద్దు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు

సరిహద్దు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. కేంద్రం కీలక ఆదేశాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : భారత సరిహద్దులో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లో హైఅలర్ట్ ప్రకటించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు, పాలనాధికారులకు పూర్తిగా సెలవులను రద్దు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో విద్యాసంస్థలను కూడా మూసివేయనున్నారు. పాక్ సరిహద్దును పంచుకుంటున్న గుజరాత్ సముద్రం తీరం వెంట కోస్ట్ గార్డ్స్‌ను రౌండ్ ది క్లాక్ పహారా కాయాలని సూచించారు. పోలీసులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సెలవులును కూడా రద్దు చేశారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భారీగా భద్రత ఏర్పాటు చేశారు. హమీపుర్‌, ఉనా, బిలాస్‌పుర్‌లో భద్రతా దళాలు రంగాలోకి దిగాయి. ప్రముఖ దేవాలయాల దగ్గర తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బయటకు రావొద్దని సూచించారు. ఎవరూ అనవసర ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -