Sunday, April 12, 2026
E-PAPER
Homeఆటలుమ‌రోసారి ఆర్సీబీ భారీ స్కోర్

మ‌రోసారి ఆర్సీబీ భారీ స్కోర్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్: ఐపీఎల్ టోర్నిలో మ‌రోసారి ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. ముంబైలోని వాంఖడై స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పారించింది. ఆర్సీబీ బ్యాట‌ర్లు సాల్ట్‌(78), విరాట్‌(50), పాటిదార్(53) అర్ధ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. టీమ్ హెడ్(34), జేఎం శ‌ర్మ(7) ప‌రుగుల‌తో రాణించారు. మొత్తంగా 20 ఓవ‌ర్ల‌ల‌కు గాను ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ముందుంచింది. ముంబై బౌల‌ర్లు ఆర్థిక పాండ్యా, శాంట్నార్, శార్దుల్ చెరో వికెట్ తీశారు.

తొలుత టాస్ గెలిచి ముంబై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఆర్సీబీకి ఓపెన‌ర్లు శుభారంబానిచ్చారు. సాల్ట్ 36 బంతుల్లో 78 ప‌రుగుల‌తో క‌దంతొక్కాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్స‌ల‌ర్ల‌తో ముంబై బౌల‌ర్లును ఆడుకున్నాడు. మ‌రో ఎండోలో అత‌నికి కోహ్లి స‌పోర్ట్‌గా ఆడాడు. ప‌దో ఓవ‌ర్లు 120 ప‌రుగుల వ‌ద్ద ఆర్సీబీ సాల్ట్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన పాటిదార్ ధ‌నాధ‌న్ ఆట‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. 17 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ పూర్తి చేశారు. కోహ్లి కూడా అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈక్ర‌మంలోనే జోరుమీదున్న కోహ్లీని పాండ్యా ఔట్ చేశాడు. అయినా కానీ పాటిదార్ త‌న ఆట‌లో దూకుడు త‌గ్గించ‌లేదు. టీమ్ హెడ్‌తో క‌లిసి భారీ స్కోర్ దిశ‌గా న‌డిపించాడు. ఎడాపెడా షాట్ల‌తో బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డారు. పాటిదార్ భీక‌ర్ ఆట‌కు స్నాంటార్న్ బ్రేకులు వేశాడు. 15 ఓవ‌ర్లో పాటిదాను స్నాంటార్‌ను ఔట్ చేశాడు. ఆఖ‌రులో హెడ్, జెఎం శ‌ర్మ మెరుపులు మెరిపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -