Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఅనంతపురంలో మరో దారుణ హత్య

అనంతపురంలో మరో దారుణ హత్య

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: అనంతపురం జిల్లాలో వరుస హత్యలతో జిల్లా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. నిన్నటికి నిన్న అనంతపురం నగర శివారులో ఒక యువకుడి దారుణ హత్య ఘటన మరువక ముందే, నేడు మరో వ్యక్తి హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. అనంతపురం రూరల్ మండలం, అక్కంపల్లి గ్రామ సమీపంలో కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు సురేష్ తలపై బండరాయితో అత్యంత పాశవికంగా కొట్టి చంపారు. కంబదూరు ప్రాంతానికి చెందిన సురేష్, గత ఆరేళ్లుగా అనంతపురం రూరల్ పరిధిలోని రాచానపల్లి వద్ద గల సదాశివ కాలనీలో నివాసం ఉంటున్నాడు. మృతుడు సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కంపల్లి సమీపంలో ఒక హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. సురేష్ మంగళవారం అర్ధరాత్రి సమయంలో హోటల్ వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దారుణం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. మృత దేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad