Tuesday, November 4, 2025
E-PAPER
Homeకరీంనగర్Karimnagar: మరో బస్సు ప్రమాదం... వడ్ల ట్రాక్టర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Karimnagar: మరో బస్సు ప్రమాదం… వడ్ల ట్రాక్టర్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

- Advertisement -

నవతెలంగాణ తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జ్ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వడ్ల లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను ఆర్టీసీఆ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మెట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటచేసుకుంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు
.. సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను 108 ద్వారా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్ పరిశీలించారు.

ప్రమాద సమయంలో బస్సు 50 స్పీడ్‌తో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వేగం తక్కువగా ఉండటం వల్లే ప్రమాద తీవ్రత తక్కువ ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు. బస్సులో అందరూ నిద్రపోతూ ఉండటం వల్ల.. బస్సు అద్దాలు గుచ్చుకున్నాయని పోలీసులు తెలిపారు.

అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -