No menu items!
Sunday, August 24, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంక‌ర్నాట‌క‌లో మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే

క‌ర్నాట‌క‌లో మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కులగణను చేపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలో పూర్తైంది. మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆదేశించిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఇవాళ‌ తెలిపారు. రాష్ట్రంలో మరోసారి కులగణన చేయనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు తెలిపారు.జూన్‌ 12న కర్ణాటక మంత్రి వ‌ర్గం ప్రత్యేకంగా సమావేశం కానుంద‌ని ఆయ‌న తెలిపారు.

కాగా, కర్ణాటకలో 2015లోనే అప్పటి ప్రభుత్వం కుల గణన జరిపింది. హెచ్‌ కాంతారాజ్‌ నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్‌ ఈ సర్వేను నిర్వహించింది. ఆ సమయంలో కోటి 35 లక్షల ఇళ్లను సర్వే చేశారు. 51 ప్రమాణాల ఆధారంగా 5.98 కోట్ల మంది డాటాను సేకరించారు. అయితే.. రాజకీయపరమైన కారణాలు, ఇతర కారణాల దృష్ట్యా ఆ నివేదికను సీల్డ్‌ కవర్‌లోనే ఉంచారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad