Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో మ‌రో ఎన్నిక‌ల ప‌థ‌కం

బీహార్‌లో మ‌రో ఎన్నిక‌ల ప‌థ‌కం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నితీష్‌ ప్రభుత్వం ఓటర్లపై ఉచితాల వలను ప్రయోగించింది. ప్రజలకు 125 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితమని ప్రకటించారు. మొదటి నుండి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరలకు విద్యుత్‌ను అందిస్తున్నాము. ఇప్పుడు ఆగస్ట్‌ 1 నుండి అంటే జులై బిల్లు నుండే రాష్ట్రంలోని గృహ వినియోగదారులు 125 యూనిట్ల విద్యుత్‌ వరకు ఎలాంటి నగదు చెల్లించాల్సి అవసరం లేదు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 1.67కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ఎక్స్‌లో పేర్కొన్నారు.

రాబోయే మూడేళ్లలో గృహాల పైకప్పులపై లేదా ప్రభుత్వ స్థలాల్లో సౌరవిద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. కుటీర్‌ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు, సౌరవిద్యుత్‌ ప్లాంట్లకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, మిగిలిన వారికి ప్రభుత్వం తగిన మద్దతును అందిస్తుందని తెలిపారు. అంటే గృహ వినియోగదారులు ఇకపై 125 యూనిట్ల వరకు విద్యుత్‌ కోసం ఎటువంటి ఖర్చు భరించాల్సిన అవసరంలేదని, రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 10,000 మెగావాట్ల వరకు సౌరశక్తి అందుబాటులో ఉంటుందని అన్నారు.

తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జెడి) నేత, మాజీ డిప్యూటీ సిఎం తేజస్వీయాదవ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ నేత 200 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితమని ప్రకటించడంతో బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ దిగిరావాల్సి వచ్చిందని ఆర్‌జెడి అధికార ప్రతినిధి శక్తి సింగ్‌ యాదవ్‌ ఏద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -