నవతెలంగాణ-హైదరాబాద్: జడ్జీల ఆస్తులు, నియమాక ప్రక్రియపై మొదటిసారి సుప్రీంకోర్టు చారిత్రాత్మక అడుగు వేసింది. జడ్జీల ఆస్తుల వివరాలను, నియామక ప్రక్రియను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు వీలుగా సోమవారం తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.ఇప్పటికే వివరాలు వెల్లడించిన జడ్జీల ఆస్తుల స్టేట్‌మెంట్‌లను అప్‌లోడ్ చేస్తున్నారు. ఇతర జడ్జీల ఆస్తుల స్టేట్‌మెంట్ అందిన వెంటనే అప్‌లోడ్ చేస్తారు అని కోర్టు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. పారదర్శకతను పెంపొందించాలనే ప్రయత్నంలో భాగంగా, జడ్జీల ఆస్తుల వివరాలను కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని భారత అత్యున్నత న్యాయస్థానం పూర్తి ధర్మాసనం (ఫుల్‌బెంచ్) ఏప్రిల్ 1న నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అలాగే ప్రజలకు విజ్ఞానం మరియు అవగాహనను పెంచేందుకు హైకోర్టులు, సుప్రీంకోర్టు నియామకాల పూర్తి ప్రక్రియను కూడా కోర్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 2022, నవంబర్ 9 నుండి 2025, మే 5 వరకు హైకోర్టు జడ్జీల నియామకాల కోసం సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించిన ప్రతిపాదనలు, పేర్లు, ఆధారం, హైకోర్టు, సర్వీస్ లేదా బార్ నమూనా, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన తేదీ, న్యాయశాఖ నోటిఫికేషన్ తేదీ, నియామక తేదీ, ప్రత్యేక వర్గం (ఎస్‌సి/ఎస్‌టి/ఒబిసి/మైనారిటీ/మహిళ) మరియు సిట్టింగ్ అభ్యర్థా లేదా రిటైర్డ్ హైకోర్టు / సుప్రీంకోర్టు జడ్జీకి సంబంధించిన వారా అనే వివరాలను కూడా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
సుప్రీంకోర్టు మరో చారిత్రాత్మక నిర్ణయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES