- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు అమలుకు పాఠశాల విద్యాశాఖ BSNL, T–ఫైబర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తొలి విడతలో 22,730 పాఠశాలలకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. బీఎస్ఎన్ఎల్ 5,342 పాఠశాలలకు, టీ–ఫైబర్ 5,000 పాఠశాలలకు సేవలు అందించనుంది. తదుపరి దశలో 12,388 పాఠశాలలకు సేవలు విస్తరించనున్నారు.
- Advertisement -



