Tuesday, March 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్ దాడిలో మ‌రో ఇరాన్ కీల‌క నేత మృతి

ఇజ్రాయిల్ దాడిలో మ‌రో ఇరాన్ కీల‌క నేత మృతి

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇజ్రాయిల్ దాడిలో మ‌రో ఇరాన్ కీల‌క నేత మ‌ర‌ణించాడు. ఇరాన్ ఉన్నతాధికారి అలీ లారిజానీ కూడా హతమైనట్లుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. ఈ మేరకు ఐడీఎఫ్‌ ఎక్స్‌లో పేర్కొంది.అలీ లారిజానీ మరణించారా లేదా గాయపడ్డారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇరాన్ కూడా స్పందించలేదు.

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు కీలక అధికారులు హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతల నేప‌థ్యంలో తీవ్ర గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -